తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండపైకి అన్ని వాహనాలను అనుమతించాలి.. స్థానికుల ఆందోళన

యాదగిరిగుట్టలో స్థానికులు ఆందోళన చేపట్టారు. భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించకుండా ఇష్టానుసారంగా ఆలయ ఈవో గీతారెడ్డి తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు

Locals in Yadagirigutta
స్థానికుల ఆందోళన

By

Published : Apr 3, 2022, 4:21 PM IST

యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రోడ్డుపై స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించకుండా ఇష్టానుసారంగా ఈఓ వ్యవహరిస్తున్నారని నిరసన తెలిపారు.

ద్విచక్రవాహనాలు సహా భక్తుల అన్ని రకాల వాహనాలను కొండపైకి అనుమతించాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్థానిక భక్తులకు ఎలాంటి షరతులు లేకుండా దర్శనం కల్పించాలన్నారు. యాదాద్రి దేవస్థానంలో స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కొండ పైకి ఆటోలను తక్షణం అనుమతించాలని డిమాండ్ చేశారు.

దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏసీపీ కోట్ల నరసింహ రెడ్డి అక్కడికి చేరుకుని నిరసన కారులతో మాట్లాడారు. వారి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.

ఇదీ చదవండి: DRONE SURVEY: డ్రోన్​తో భూసర్వేకు అధికారుల యత్నం.. అడ్డుకున్న నిర్వాసితులు

ABOUT THE AUTHOR

...view details