తెలంగాణ

telangana

ETV Bharat / state

'లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో కేటీఆర్​ మరింత ఎదగాలి' - గొంగిడి సునీతా మహేందర్​రెడ్డి తాజా వార్తలు

యాదగిరిగుట్ట మున్సిపల్​ కార్యాలయ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్​ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే సునీతా మహేందర్​రెడ్డి... కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా కేక్​ కట్​ చేశారు. స్థానిక మున్సిపల్​ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ktr birthday celebrations at yadagirigutta
'లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో కేటీఆర్​ మరింత ఎదగాలి'

By

Published : Jul 24, 2020, 3:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్​ కార్యాలయ ప్రాంగణంలో కేటీఆర్​ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతామహేందర్​రెడ్డి కేక్​ కట్​ చేశారు. యాదగిరిగుట్ట తెరాస అధ్యక్షులు బత్తిని అంజనేయుల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్​ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్​ ఆవరణలో మొక్కలు నాటారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులతో కేటీఆర్​ ఎంతో ఎత్తుకు ఎదిగి.. రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details