యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్ సమీక్ష - KCR REVIEW IN YADADRI
యాదాద్రిలో స్థానిక అతిథిగృహంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణాలు, సుదర్శన మహాయాగం నిర్వహణ, ప్రెసిడెన్షియల్ సూట్లు, ఆలయ నగరి నిర్మాణాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్ సమీక్ష
యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు, యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ యాడా నిర్వాహకులతో స్థానిక హరిత అతిథిగృహంలో సమావేశమయ్యారు. ఆలయ పునర్నిర్మాణాలు, సుదర్శన మహాయాగం నిర్వహణ, ప్రెసిడెన్షియల్ సూట్లు, ఆలయ నగరి నిర్మాణాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. గండిచెరువు సమీపంలో రింగ్ రోడ్ అయిన ఆరు వరుసల రహదారికి ఆనుకుని ఉన్న చెరువు భూములపైన చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమీక్ష 45 నిమిషాల పాటు సాగింది.
- ఈ కథనం చదవండి: యాదాద్రిలో కేసీఆర్... ఆలయ పనుల పురోగతిపై ఆరా...
Last Updated : Dec 17, 2019, 8:02 PM IST
TAGGED:
KCR REVIEW IN YADADRI