తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎర్రకోటపై జెండా ఎగరేద్దాం.. - KTR WARANGAL

నిధుల కోసం యాచించం..దిల్లీనే శాసిస్తాం. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం..16 పార్లమెంట్ స్థానాలు గెల్చుకుని రాష్ట్రంలో నిధుల వరద పారిస్తాం. సన్నాహక సమావేశాల్లో పంచ్​ డైలాగులతో కేటీఆర్ దూకుడు పెంచారు.

దిల్లీని శాసిస్తాం

By

Published : Mar 7, 2019, 8:10 PM IST

Updated : Mar 7, 2019, 11:49 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టింది. 16పార్లమెంట్ స్థానాలు గెల్చుకుని దిల్లీని శాంసించాలనుకుంటోంది. ఇదే విషయాన్ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పదే పదే చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే లోక్​సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన..16 స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం చెవులు పిండి తెలంగాణకు నిధుల వరద తీసుకొస్తామని వివరిస్తున్నారు.

యాచించం..దిల్లీని శాసిస్తాం..

దిల్లీని శాసిస్తాం

యాదాద్రిలో నర్సింహస్వామి ఉన్నంత కాలం కేసీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్‌.భువనగిరి నియోజకవర్గంలో కృష్ణా, గోదావరి , మూసీ జలాలతో త్రివేణి సంగమంఏర్పాటు కాబోతుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఫార్మాసిటీ క్లస్టర్ వస్తుందన్నారు.

అందరి గుండెల్లో కేసీఆర్

రాష్ట్రంలో ఉన్నవాళ్లంతా తమ వాళ్లేనని, అందరికి కేసీఆర్ నాయకత్వం నచ్చిందన్నారు. పైకి కండువా ఏది వేసుకున్నా... వారి గుండెల్లోకేసీఆరే ఉన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించాలని గులాబీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:రేసు గుర్రాల వేట

Last Updated : Mar 7, 2019, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details