యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో కార్తిక మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తిక మాసం కావడంతో 60 అడుగుల పంచముఖ పరమేశ్వరునికి నిజాభిషేకం, హావన కార్యక్రమం చేపట్టారు. అనంతరం శివుని విగ్రహ పాదాలకు అష్టోత్తర క్షీరాభిషేకం చేశారు. సర్పసూక్త హావనం జరిపారు.
సురేంద్రపురిలోని పంచముఖ పరమేశ్వరునికి కార్తిక పూజలు
యాదాద్రి సమీపంలోని సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర ఆలయంలో కార్తిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పంచముఖ శివుని విగ్రహ పాదాలకు క్షీరాభిషేకం చేశారు. పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తిక మాసం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.
సురేంద్రపురిలోని పంచముఖ పరమేశ్వరునికి కార్తిక పూజలు
లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కావడంతో సురేంద్రపురిలో ధాత్రి నారాయణ స్వామి వారి పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి:ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం