తెలంగాణ

telangana

ETV Bharat / state

KA Paul In Farmer Getup: రైతు వేషంలో కేఏ పాల్‌.. వీడియో చూశారా? - కేఏ పాల్ తాజా వార్తలు

KA Paul In Farmer Getup: మునుగోడులో రాజకీయ ప్రచారాలు ముమ్మరం అయ్యాయి. అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర్య అభ్యర్థి కేఏ పాల్​ తనదైన స్టైల్​లో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. రైతు వేషంలో ఓటర్లను పలకరించి.. కాసేపు వారితో ముచ్చటించారు.

KA paul in munugode bypoll
KA paul in munugode bypoll

By

Published : Oct 29, 2022, 9:40 AM IST

Updated : Oct 29, 2022, 9:49 AM IST

KA paul in munugode bypoll: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తనదైన శైలిలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా చండూరులో రైతు వేషంలో ఓటర్లను పలకరించారు. తలకు కండువా కట్టుకుని పొలాలకు వెళ్లి అన్నదాతలతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

KA Paul In Farmer Getup: అనంతరం సైకిల్‌ తొక్కుతూ ఓటర్లను కలిశారు. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెరాస, భాజపాకు ఓటేస్తే అభివృద్ధి జరగబోదని, ఓట్ల కోసం డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

రైతు వేషంలో ఓటర్లను పలకరించిన పాల్‌..

ఇవీ చదవండి:

Last Updated : Oct 29, 2022, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details