యాదగిరిగుట్ట పట్టణం గోశాలలో హీల్ స్వచ్ఛంద సంస్థ, బ్రహ్మకుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఫ్రెండ్లీ పరీక్షా విధానంపై విలువైన సూచనలు ఇచ్చారు. బ్రహ్మకుమారి ట్రస్ట్ బషీర్ బాగ్ ఇంఛార్జి అంజలి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతలు సభను ప్రారంభించారు.
ఫ్రెండ్లీ పరీక్షా విధానంపై విద్యార్థులకు సూచనలు - యాదగిరిగుట్ట వార్తలు
యాదగిరిగుట్ట పట్టణంలో పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఫ్రెండ్లీ పరీక్షా విధానంపై మెలకువలు నేర్పించారు. గోశాలలో హీల్ స్వచ్ఛంద సంస్థ, బ్రహ్మకుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫ్రెండ్లీ పరీక్షా విధానంపై విద్యార్థులకు సూచనలు
విద్యార్థులు భయం లేకుండా చదువుపై మనస్సును కేంద్రీకృతం చేసి పరీక్షలు ఏలా రాయాలనే దానిపై యాదగిరిగుట్ట బ్రహ్మకుమారి కేంద్రం ఇంఛార్జి నాగలక్ష్మి సూచనలు ఇచ్చారు. విద్యార్థులు చేసే పనిపై నిమగ్నమైనప్పుడే చదువుకు తగిన ప్రతిఫలం దక్కుతుందన్నారు. మనస్సును ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంచుకుంటామో అప్పుడు విజయం మన సొంతమౌతుందన్నారు. మీ పతనానికి మీ మనస్సే కారణమౌతుందన్నారు.
ఇదీ చూడండి :ఉత్పత్తి ఎక్కువ.. ఆదాయం తక్కువ..