తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంఎస్​ఎంఈ రుణ పరిమితి పెంచండి' - komatireddy venkat reddy

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్​ఎంఈ)లకు ఇచ్చే రుణాన్ని పెంచాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లోక్​సభలో కోరారు. ఈ విషయమై స్పందించిన ఆ శాఖ మంత్రి గడ్కరీ రుణాలు వేగంగా ఇచ్చేందుకు ఆదేశించామని తెలిపారు.

కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

By

Published : Jul 25, 2019, 2:08 PM IST

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లోక్​సభలో అన్నారు. గతంలో చూడని నిరుద్యోగం కనిపిస్తోందన్నారు. ఈ సమస్య అధిగమించేందుకు... ఉద్యోగాలు పెంచేందుకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్​ఎంఈ)లకు ఇచ్చే రుణాన్ని కోటి నుంచి రూ.5కోట్లకు పెంచాలని కోరారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్​ఎంఈ)లకు రుణాలు వేగంగా ఇచ్చేందుకు ఆదేశించానని ఆ శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ఇప్పటివరకు 36వేల రుణాలు అందించామన్నారు.

'ఎంఎస్​ఎంఈ రుణ పరిమితి పెంచండి'

ABOUT THE AUTHOR

...view details