తెలంగాణ

telangana

దైవారాధనలకు విష్ణు.. పుణ్యస్నానాలకు లక్ష్మీ పుష్కరిణులు

యాదాద్రీశుని ఆలయ సన్నిధిలో ఉన్న విష్ణు పుష్కరిణిని రూ.4.01 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. దైవ కార్యక్రమాల కోసం ఈ పుష్కరిణిని వినియోగించనున్నారు. కొండకింద భక్త జనుల పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా లక్ష్మీ పుష్కరిణి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.6.67 కోట్ల ఖర్చుతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

By

Published : Feb 15, 2021, 10:27 AM IST

Published : Feb 15, 2021, 10:27 AM IST

In Yadadri, different Pushkarinis are arranged for worship and holy baths of the devotees
దైవారాధనలకు విష్ణు.. పుణ్యస్నానాలకు లక్ష్మీ పుష్కరిణులు

యాదాద్రి పంచనారసింహుల క్షేత్రంలో దైవారాధన, భక్తుల పుణ్యస్నానాల కోసం వేర్వేరుగా పుష్కరిణిల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపై ఆలయ సన్నిధిలో గల విష్ణు పుష్కరిణిని రూ.4.01 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. ఆలయోత్సవాల్లో భాగంగా జరిపే కార్యక్రమాల కోసం ఈ పుష్కరిణిని వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుష్కరిణి మధ్యలో కృష్ణ శిలతో మండపం నిర్మించారు.

ఆలయ సన్నిధిలో గల విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ

పూజారుల దుస్తుల మార్పిడికి 7 గదులను కట్టారు. ఉత్సవ వేడుకలను తిలకించే భక్తుల కోసం నలువైపులా బండ్ ఏర్పాటవుతోంది. కొండకింద గండిచెరువు వద్ద భక్త జనుల పుణ్యస్నానాల కోసం ప్రత్యేకంగా పుష్కరిణి నిర్మాణం చేపట్టారు. రూ.6.67 కోట్ల ఖర్చుతో లక్ష్మీదేవి పేరిట పుష్కరిణి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రెండు చోట్ల చేపట్టిన పనులను మరింత వేగవంతం చేశారు.

కొండకింద నిర్మించనున్న లక్ష్మీదేవి పుష్కరిణి నమూనా

ఇదీ చూడండి: ఈ దారులు.. రహదారులయ్యేదెపుడు!

ABOUT THE AUTHOR

...view details