మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కకపోవడం అసంతృప్తిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. భువనగిరిలోని పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మాట్లాడుతున్న చాడ
By
Published : Feb 19, 2019, 8:47 PM IST
పొత్తుల విషయంలో స్పష్టతలేదు
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పష్టత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మార్చి మొదటి వారంలోపు స్పష్టత రాకుంటే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. తమతో కలుస్తామంటే సీపీఎంతో జతకడతామన్నారు. అందోల్‌లో రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సూచించారు.