యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారితీసింది. పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన నాగరాజుకు యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లికి చెందిన కవితతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజు కూలి పనులు చేసుకుని జీవించే వీరి మధ్య తరచు గొడవలు జరిగేవని బంధువులు తెలిపారు. వారం రోజుల క్రితం కవితపై కిరోసిన్ పోసి చంపాలని చూడగా తపించుకున్న కవిత తన తల్లిగారి ఇంటికి వెళ్ళింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇంటికి పంపించారు. అయినా నాగరాజు మాత్రం మారలేదు. సోమవారం రాత్రి భార్య తలపై గ్రానైట్ రాయితో బలంగా కొట్టాడు. చుట్టుపక్కలవారు ఆసుపత్రికి తరలించే లోపే కవిత మరణించింది.
హత్యకు దారితీసిన భార్యాభర్తల గొడవ - husband
భువనగిరి పట్టణంలోని ఓ ఇంట విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య వివాదం ప్రాణాల మీదకు తెచ్చింది. హనుమాన్ వాడకు చెందిన నాగరాజు భార్య కవితపై గ్రానైట్ రాయితో తలపై బలంగా కొట్టగా అక్కడికక్కడే మరణించింది.
హత్యకు దారితీసిన భార్య భర్తల గొడవ
కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హంతకుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి:సోహెల్ది హత్య కాదు.. ఆత్మహత్యే
Last Updated : Apr 30, 2019, 11:10 PM IST