యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో యాదాద్రీశుడి సన్నిధి కిటకిటలాడింది.కుటుంబ సమేతంగా యాదాద్రికి తరలివచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు నిండిపోయాయి.
'భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి' - TEMPLE DEVELOPMENT
యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీ నరసింహుడి క్షేత్రాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటం వల్ల ఆలయ అధికారులు లఘు దర్శనం కల్పించారు.
లక్ష్మీనరసింహుల దర్శనానికి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు
స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు నుంచి రెండు గంటలన్నర సమయం వరకు పట్టింది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున దేవస్థానం అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించలేదు.
ఇవీ చూడండి : ఉన్మాదికి ఉరిశిక్ష వేయాలంటూ రిలే దీక్ష