తెలంగాణ

telangana

ETV Bharat / state

Heavy Rush at Yadadri Temple: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తజనం - ts news

Heavy Rush at Yadadri Temple: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి రెండుమూడు గంటల సమయం పడుతోంది.

Heavy Rush at Yadadri Temple: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తజనం
Heavy Rush at Yadadri Temple: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

By

Published : Jan 1, 2022, 4:55 PM IST

Heavy Rush at Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు రెండుమూడు గంటల సమయం పడుతోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు స్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

సుప్రభాత సేవతో స్వామివారికి పూజలు ప్రారంభించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కొండపైన సువర్ణ పుష్పార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. లడ్డూ ప్రసాదాలు 69 వేలు తయారుచేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి గీతారెడ్డి తెలిపారు. ప్రసాదాల విక్రయాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తామని చెప్పారు.

Heavy Rush at Yadadri Temple: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తజనం

'ఈ 2022 యాదాద్రి చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోనుంది. మార్చి 28వ తేదీన జరిగే మహాసంప్రోక్షణ కార్యక్రమంతో స్వామివారి స్వయంభు దర్శనాన్ని భక్తులందరికీ ఈ సంవత్సరం కలిగించనుంది. ప్రతి ఒక్కరికీ స్వామివారి కటాక్షం లభించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.' -గీతారెడ్డి, యాదాద్రి ఆలయ ఈవో

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details