తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో వర్ష బీభత్సం - యాదాద్రిలో వర్ష బీభత్సం

యాదాద్రి జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రాకపోకలు స్తంభిచాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ చెట్లు విద్యుత్ తీగలపై పడటం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

యాదాద్రిలో వర్ష బీభత్సం

By

Published : Oct 6, 2019, 1:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని రైతు బజార్​లో షెడ్లు నేలకూలాయి. పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద పార్క్ చేసిన బైకులపై ఫ్లెక్సీ కూలి రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. భువనగిరి-నల్లగొండ రహదారికి ఇరువైపులా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై పడటంతో అప్రమతమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరాను నిలిపివేయటంతో పెను ప్రమాదం తప్పింది.

యాదాద్రిలో వర్ష బీభత్సం

ABOUT THE AUTHOR

...view details