తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసి ముద్దైన వలిగొండ... గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు - వలిగొండలో భారీ వర్షం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. మండలంలో 193.6 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైనదని అధికారులు వెల్లడించారు.

తడిసి ముద్దైన వలిగొండ... గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
తడిసి ముద్దైన వలిగొండ... గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు

By

Published : Sep 14, 2020, 1:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో భారీ వర్షం కురిసింది. వెములకొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుట్టపైనున్న నీటి గుండం నిండింది. గుట్ట పైకెక్కే మెట్లపై నుంచి వర్షపు నీరు జారిపడుతూ జలపాతాన్ని తలపిస్తోంది.

పొంగి పొర్లుతున్న చెరువులు

వలిగొండ పట్టణంలో కురిసిన వర్షానికి రెండు ఇళ్ల ప్రహరీలు కూలిపోయాయి. మండలంలోని వెల్వెర్తి- అరూర్, వలిగొండ - లింగరాజుపల్లి, వలిగొండ - దాసిరెడ్డి గూడెం, వలిగొండ- సుంకిశాల, లోతుకుంట- నర్సయ్య గూడెం, మల్లెపల్లి- వెల్వర్తి గ్రామాల మధ్య కల్వర్టులపై నుంచి వరద నీరు పొంగుతుంది. వెములకొండ చెరువు అలుగు పోస్తుంది. మండలంలో వరద, మురుగు కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి.

ఇదీచూడండి:భాగ్యనగరంలో వర్షం.. పలు చోట్ల ప్రజలకు ఇక్కట్లు

ABOUT THE AUTHOR

...view details