మంచుతో వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకొంది. మంచు కారణంగా ఉద్యోగస్థులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి వద్ద దారి కనిపించక వాహనదారులు లైట్ల వెలుతురులో ప్రయాణం చేస్తున్నారు. భువనగిరి రైలు నిలయం నుంచి కృష్ణా, కాకతీయ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.