చేనేత కార్మికులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేనేత కార్మికసంఘం ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కమిటీ ఆధ్వర్యంలో నేతన్నలు నిరసన చేపట్టారు. లాక్డౌన్ వల్ల అత్యధికంగా నష్టపోయిన చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'కరోనాతో చితికిపోయాం.. నెలకు రూ.8వేలు ఇచ్చి ఆదుకోండి'
చేనేత రంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చేనేత కార్మికసంఘం ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో చేనేత కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపట్టారు.
చేనేత కార్మికులు ముడి సరుకు కొనుగోలు చేసే సమయంలోనే సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ప్రతి చేనేత కార్మికునికి 8 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి.. చేనేత కార్మిక కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు బేతి శ్రీను, బడుగు జహంగీర్, చింతకింది వెంకటేష్, చింతకింది మురళి, చెన్న రాజేష్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎరువుల కర్మాగారాన్ని పరిశీలించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి