యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం ధర్మారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామెల్ చెరువు కట్ట పై ఈత, ఖర్జూర మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని గ్రామంలో 30 వేల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మానవాళి మనుగడ కోసం చెట్లు దోహద పడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను చంటి పిల్లల వలే కాపాడాలని అన్నారు.
ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మందుల సామెల్ - గ్రీన్ ఛాలెంజ్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం ధర్మారం గ్రామ చెరువు కట్టపై ఈత, ఖర్జూర మొక్కలు నాటారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామెల్. రాజ్యసభ సభ్యుడు సంతోష్ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని తెలిపారు.
రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్‌కి రాజ్యసభ సభ్యుడి గ్రీన్ ఛాలెంజ్!