తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి కోటకు క్రమంగా పెరుగుతున్న సందర్శకుల తాకిడి - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

భువనగిరి కోటకు రోజురోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. లాక్​డౌన్​ కారణంగా సందర్శకులు లేక వెలవెలబోయిన కోటలోకి.. ఈ నెల ఒకటో తేదీ నుంచి పర్యటకులను అనుమతిస్తున్నారు. రాక్ క్లైంబింగ్ స్కూల్ కూడా తెరచుకోవటం వల్ల పర్వతారోహణ చేయటానికి పర్యటకులు వస్తున్నారు.

gradually increasing visitors to the bhongir fort in bhuvanagiri
భువనగిరి కోటకు క్రమంగా పెరుగుతున్న సందర్శకుల తాకిడి

By

Published : Oct 11, 2020, 8:42 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోటకి పర్యటకుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతోంది. లాక్​డౌన్ కారణంగా మూత పడ్డ భువనగిరి కోటలోకి ఈ నెల ఒకటో తేదీ నుంచి పర్యటకులను అనుమతిస్తున్నారు. సందర్శకులు లేక వెలవెలబోయిన భువనగిరి కోటకు ఇప్పుపుడిప్పుడే పర్యటకులు వస్తున్నారు. సందర్శకులు కోటపై భాగానికి చేరుకొని భువనగిరి పరిసరాలను, అందాలను తిలకిస్తున్నారు. ఇవాళ సెలవుదినం కావడం వల్ల సందర్శకులు చాలా మంది వచ్చారు.

మరోవైపు భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ కూడా తెరచుకోవటం వల్ల పర్వతారోహణ చేయటానికి పర్యటకులు వస్తున్నారు. ఈరోజు టాటా నిక్సన్ వాహనం ప్రమోషన్​లో భాగంగా టాటా వాహన డీలర్ల వద్ద వాహనాలు కొనుగోలు చేసిన 35 మంది వినియోగదారులు పర్వతారోహణ చేశారు. ఇప్పుడిప్పుడే కార్పొరేట్ ఉద్యోగులు కూడా వారాంతంలో రాక్ క్లైంబింగ్ స్కూల్​కి వచ్చి పర్వతారోహణలో ప్రాథమిక అంశాలను నేర్చుకుంటున్నారు.

ఇవీ చూడండి: దర్గాను సందర్శించిన మాజీ ఎంపీ కవిత

ABOUT THE AUTHOR

...view details