తెలంగాణ

telangana

ETV Bharat / state

'రజకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది'

యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి మెకనైజేషన్ లాండ్రీ యూనిట్ ఆలేరుకు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. మెకనైజేషన్ లాండ్రీ భవన నిర్మాణానికి ఆదివారం ఆమె శంకుస్థాపన చేశారు. దీని ద్వారా రజక వృత్తిదారుల కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి దొరుకుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు.

mechanized laundry unit in aleru
'రజకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది'

By

Published : Oct 5, 2020, 7:48 AM IST

రజకుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. ఆలేరులో మోడ్రన్ మెకనైజేషన్​ లాండ్రీ భవన నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు, యంత్రాల కోసం రూ.16 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. దీని ద్వారా రజక వృత్తిదారుల కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లాలో మొదటి మెకనైజేషన్ లాండ్రీ యూనిట్ ఆలేరుకు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు.

స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్ చెక్కుల పంపిణీ

అనంతరం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో 12 మంది లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ నియంత్రిక ఏర్పాటు పనులను పరిశీలించారు.

ఇవీ చూడండి:కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంకు ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details