యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కుర్మ కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎడ్ల చంద్రయ్యకు సుమారు 100 గొర్రెలు ఉన్నాయి. నిన్న రాత్రి వర్షం కారణంగా చంద్రయ్య దొడ్డి వద్దకు కాపలాకు వెల్లకపోవడాన్ని గమనించిన దొంగలు ఇదే అదనుగా భావించి 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఉదయానికి దొడ్డి వద్దకు వెళ్లి చూడగా గొర్రెలను ఎవరో ఎత్తుకెళ్లారని గమనించిన చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వర్షంలో 30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు - sheeps
వర్షం పడుతుండగా 30 గొర్లను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కుర్మ కొత్తగూడంలో చోటు చేసుకుంది.
30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు