యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన దాత జ్ఞానేశ్వర్ సహకారంతో బంగారు ఊయల ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి అంగీకారం తెలిపారు.
యాదాద్రీశుడి బంగారు ఊయల తయారీకి సర్వం సిద్ధం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు యాడ అధికారులు దృష్టి సారించారు. స్వామివార్లకు స్వర్ణ ఊయల, స్వర్ణ తొడుగు తదితర ఆభరణాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.
యాదాద్రీశుడి బంగారు ఊయల తయారీకి సర్వం సిద్ధం
అద్దాల మండపం నిర్మాణం పనులను వేగవంతం చేశారు. ఈ మండపంలోనే స్వామివార్లకు నిత్యం ఊంజల్ సేవ నిర్వహిస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆగమ శాస్త్రానుసారం ప్రధాన ఆలయానికి నైరుతి, ఈశాన్యం, వాయువ్య, ఆగ్నేయం దిక్కుల్లో గరుడ విగ్రహాలు పొందుపరిచారు. ప్రధాన ఆలయానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో ఉన్న ప్రధాన రాజగోపురాలకిరువైపులా ఒక్కోదానికి రెండు చొప్పున మొత్తం ఎనిమిది శంఖు, చక్ర, తిరు నామాలను అమర్చే పనులు పూర్తయ్యాయి.