యాదాద్రి పుణ్యక్షేత్రంలోని పాతగుట్ట ఆలయంలోని శ్రీలక్ష్మినరసింహస్వామి మూలవర్యులకు బంగారు తాపడం తొడుగును ధరింపజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ అభరణాన్ని వేద మంత్ర పఠనాల మధ్య అలంకరించారు.
నరసింహస్వామి మూలవర్యులకు బంగారు తొడుగు - తెలంగాణ వార్తలు
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి మూలవర్యులకు బంగారు తాపడం తొడుగు ధరింపజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ తంతు జరిపించారు. ఇదివకు ఉన్న వెండి కవచానికి బంగారు తాపడం చేయించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
నరసింహస్వామి మూలవర్యులకు బంగారు తొడుగు
ఈ తొడుగును హైదరాబాద్ మలక్పేట్కు చెందిన దాత రోషన్ అగర్వాల్ అందించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మ కర్త నరసింహ మూర్తి తెలిపారు. ఇదివరకు ఉన్న వెండి కవచానికి 45 గ్రాముల బంగారం తాపడం చెన్నైలో తయారు చేయించినట్లు వివరించారు.
ఇదీ చదవండి:సినీఫక్కీలో చోరీ... తాళ్లతో కట్టేసి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!