యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణ కట్ట, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించిపోయారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ భద్రత, ఆలయ అభివృద్ధి పనుల కారణంగా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి - FULL OF DEVOTEES IN YADADRI LAXMINARASIMHA SWAMY TEMPLE
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి