లాక్డౌన్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద అంతర్రాష్ట్ర కార్మికులకు, పాదచారులకు రెడ్డి బావి గ్రామ యువత సాయం అందిస్తున్నారు. ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు సహా తదితర పోలీసుల ఆధ్వర్యంలో పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.
స్తంభించిపోయిన రవాణా.. మానవత్వం చాటుతున్న యువత - అంతరాష్ట్ర కార్మికులు
కరోనా నేపథ్యంలో ఎక్కడిక్కడ స్తంభిచిపోయిన పనుల కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు రెడ్డిబావి యువత చేయూత నిస్తూ మానవత్యం చాటుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద పాదచారులకు, అంతరాష్ట్ర కార్మికులకు ఆహారపొట్లాలు పంపిణీ చేశారు.
స్తంభించిపోయిన రవాణా.. మానవత్వం చాటుతున్న యువత
యువత చెడు మార్గాలకు, మద్యానికి బానిస కాకుండా ఇటువంటి సమాజసేవలో పాల్గొనాలని ఏసీపీ సత్తయ్య పేర్కొన్నారు. స్వీయ నిర్బంధం, భౌతిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి:'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'