యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని రెండు దుకాణాలకు గ్రామపంచాయతీ సిబ్బంది జరిమానాలు విధించింది. కరోనా వ్యాధి విజృంభిస్తున్న దృష్ట్యా పట్టణంలో దుకాణాదారులతో అఖిలపక్ష నాయకులు చర్చించి... దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని నిర్ణయించారు. నిబంధనలు పాటించని వారికి రూ.1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
నింబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై జరిమానాలు
కరోనా వ్యాధి విజృంభిస్తున్న దృష్ట్యా దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకే తెరిచి ఉంచాలన్న నిబంధనను ఉల్లంఘించాయని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో రెండు దుకాణాలకు జరిమానా విధించారు. దుకాణ యజమానుల నుంచి గ్రామ పంచాయతి సిబ్బంది రూ.1000 చొప్పున జరిమానా వసూలు చేశారు.
నింబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై జరిమానాలు
ఈక్రమంలో నిబంధనలు ఉల్లంఘించి సమయపాలన పాటించనందుకు గానూ ఇద్దరు దుకాణ యజమానుల నుంచి గ్రామ పంచాయతి సిబ్బంది రూ.1000 చొప్పున జరిమానా వసూలు చేశారు. ఇకముందు సైతం ఎవరైనా నిబందనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని సర్పంచ్ జన్నాయికోడె నగేశ్ తెలిపారు.