తమ భూములను అటవీశాఖ అధికారులు అక్రమంగా ఆక్రమిస్తే సహించేది లేదని, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. వందేళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న భూముల చుట్టూ అటవీ అధికారులు కంచె వేస్తున్నారని వారు ఆరోపించారు. దీనితో తమ భూమిలోకి పోలేని పరిస్థితి నెలకొందని దాని వల్ల తాము ఉపాధిని కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.
మా భూముల్లో కంచె వేయడం తగదు: ఇబ్రహీంపూర్ రైతులు
భూముల్లో సర్వే నిర్వహించడానికి వచ్చిన అటవీ అధికారులను యాదాద్రి భువనగిరి జిల్లా ఇబ్రహీంపూర్ రైతులు అడ్డుకుని ధర్నా చేపట్టారు. వందేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న తమ భూముల్లో అధికారులు అక్రమంగా కంచె వేసి సర్వే నిర్వహించడం తగదని ఆరోపిస్తూ తమ సమస్యను పరిష్కరించాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మా భూముల్లో కంచె వేయడం తగదు ఇబ్రహీంపూర్ రైతుల ఆందోళన
సర్వే నిర్వహించడానికి వచ్చిన అధికారులను అడ్డుకుని తమ సమస్య పరిష్కారం అయిన తర్వాతే పనులు చేపట్టాలని తెలిపారు. తమ భూములకు పట్టా పుస్తకాలు ఉన్నాయని.. తమకు రైతు బంధు పథకం కూడా వస్తుందని వారు పేర్కొన్నారు. అటువంటి భూముల్లో అక్రమంగా కంచె వేయడం అధికారులకు సబబు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తుర్కపల్లి తహసీల్దారుని కలవగా ఆయన అటవీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు.
ఇదీ చదవండి :'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'