యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని మండలాలు, గ్రామాల్లో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవగా... ధాన్యం కేంద్రాల వద్దే ధాన్యం మొత్తం తడిసిపోయింది. భువనగిరి మండలంలోని హన్మపురం, ముత్తిరెడ్డిగూడెం, అనంతారం ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం తడిసి పోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షానికి ఆగమైన అన్నదాతలు - యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి ఆగమైన అన్నదాతలు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నాశనమైపోయింది. కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం మొత్తం తడిసిపోయింది. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు.
అకాల వర్షానికి ఆగమైన అన్నదాతలు
కేవలం పంటలు నాశనమవడమే కాకుండా వలిగొండ మండలంలోని టేకులసోమారం గ్రామంలో ఓ ఇంటి పైకప్పు లేచిపోయింది. సంగెం గ్రామంలో ఓ ఇంటిపై చెట్టు కొమ్మ విరిగి పడటం వల్ల రేకులు ధ్వంసం అయ్యాయి. భువనగిరి పట్టణంలో రహదారికి అడ్డంగా చెట్టు కొమ్మ విరిగి పడింది.
ఇవీ చూడండి:లాక్డౌన్ ఆంక్షలతో మొదలైన రంజాన్ వేడుకలు