యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం కంచర్లపల్లికి చెందిన శీల లింగయ్య (40 ) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. తన వ్యవసాయ బావి వద్ద బోరు మోటారు పని చేయకపోవడం వల్ల పక్కనే ఉన్న స్టాటర్ను ఆఫ్ చేశాడు. మోటర్ రిపేర్ చేసిన తర్వాత తిరిగి ఆన్ చేసే సమయంలో 11 కేవీ విద్యుత్ తీగ తగలడం వల్ల షాక్ కొట్టి పక్కనే ఉన్న పొలంలో పడి చనిపోయాడని స్థానికులు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కంచర్లపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు ఆకాశాన్నంటాయి.
విద్యుదాఘాతంతో పొలంలో పడి రైతు మృతి