యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి అధికారుల సూచనల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సోదాలు జరిపినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి కృష్ణప్రియ తెలిపారు. దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలు, క్రయవిక్రయాల నమోదు, సీసాల లేబుళ్లు, మూతలను తనిఖీలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
యాదాద్రి భువనగిరి జిలాల్లోని పలు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం ఉన్న మద్యం సీసాల శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షల కోసం పంపిస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి కృష్ణప్రియ వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
అనుమానం ఉన్న మద్యం సీసాల శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షల కోసం పంపిస్తామని కృష్ణప్రియ వెల్లడించారు. జిల్లాలోని నాలుగు సర్కిల్ సీఐలు వారి పరిధిలో కాకుండా మరో సర్కిల్ పరిధిలో తనిఖీలు చేపడుతున్నారని ఆమె తెలిపారు.