తెలంగాణ

telangana

ETV Bharat / state

'జన్మనిచ్చిన ఊరు.. చదువునేర్పిని బడిని వారు మరవలేదు' - తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జన్మనిచ్చిన ఊరు.. చదువు నేర్పిన పాఠశాల కోసం పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్​పూర్​ ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

education minister sabitha indrareddy visit to yadadri bhuvanagiri district
యాదాద్రిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

By

Published : Dec 8, 2019, 5:57 PM IST

యాదాద్రిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మల్యాలలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం జలాల్​పూర్​ ప్రభుత్వ పాఠశాల డైమండ్​ జూబ్లీ వేడుకలల్లో మంత్రి పాల్గొన్నారు. దాదాపు రూ.కోటి వరకు కార్పస్​ ఫండ్​తో పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పూర్వ విద్యార్థులను అభినందించారు.

జన్మనిచ్చిన ఊరు.. చదువు నేర్పిన పాఠశాల కోసం వారు చేస్తున్న కృషి ఎనలేనిదని సబిత ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details