భువనగిరి నియోజకవరం పరిధిలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు నేల పాలయ్యాయని రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టంపోయారు. భూదాన్ పోచంపల్లి మండలం ధర్మారెడ్డి పల్లిలో వడగళ్ల వాన కారణంగా కోతకు వచ్చిన వరి ధాన్యం నేల రాలింది.
జిల్లాలో అకాల వర్షం.. అన్నదాతలకు తీవ్ర నష్టం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భువనగిరి నియోజకవర్గ పరిధిలో వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి, మామిడి పంటలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం
భువనగిరి మండలం నందనం గ్రామంలో చెట్లు నేల కూలి, వాహనాలపై పడడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నాలుగు రేకుల ఇళ్లు కూలిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. తమను నష్టాల నుంచి ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: భువనేశ్వర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్