యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి వాహనచోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు సీజ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
పంతంగి టోల్ ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ - police
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద రాచకొండ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. వాహనాలను ఆపి వాహనచోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
ట్రాఫిక్ పోలీసులు