తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నివారణ కోసం దివీస్​ లాబొరేటరీస్​ సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​కు దివీస్​ లాబొరేటరీ లిమిటెడ్​ యాజమాన్యం 10 థర్మల్​ స్క్రీనింగ్​ థర్మామీటర్లను అందజేసింది. ఆ కంపెనీ లైజన్​ ఆఫీసర్​ వల్లూరి వెంకటరాజు కలెక్టర్​కు అందజేశారు.

divis laboratories limited helps for corona prevention in yadadri bhuvanagiri district
కరోనా నివారణ కోసం దివీస్​ లాబొరేటరీస్​ సాయం

By

Published : May 19, 2020, 10:06 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్​కు రూ.38 వేల విలువగల 10 థర్మల్ స్క్రీనింగ్​ థర్మామీటర్లను దివీస్ లాబొరేటరీ లిమిటెడ్ లైజన్ ఆఫీసర్ వల్లూరి వెంకటరాజు అందజేశారు. కరోనా నివారణ కోసం ఎలాంటి సాయానికైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనా బారిన పడకుండా ఉండాలని ఆయన కోరారు.

కరోనా నివారణలో భాగంగా జిల్లాకు చేస్తున్న సాయం పట్ల కలెక్టర్ అనిత రామచంద్రన్ దివిస్ లాబొరేటరీ యాజమాన్యాన్ని అభినందించారు. ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి 36 లక్షల రూపాయల విలువ గల వైద్య సామగ్రి, రెండు లక్షల యాభై వేల రూపాయలతో 40 థర్మల్ స్క్రీనింగ్​ థర్మామీటర్లను అందజేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details