యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల పరిషత్ కార్యాలయములో పల్లెప్రగతి పనులపై… జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా సమీక్షించారు. మోత్కూరు, అడ్డగుడూరు మండలాల పంచాయతీ కార్యదర్శిలు సమావేశానికి హాజరయ్యారు. గ్రామ పంచాయతీ లకు కేటాయించిన నిధులతో… ట్రాక్టర్ రుణాల బకాయిలు, విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు.
పల్లె ప్రగతి పనులపై జిల్లా పంచాయతీ అధికారి సమీక్ష - పల్లె ప్రగతి పనులపై డీపీవో సమీక్ష
పంచాయతీల బకాయిలు వెంటనే చెల్లించాలని యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా అన్నారు. మోత్కూరు, అడ్డగూడూరు మండలాల పంచాయతీ కార్యదర్శులతో... పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు.
పల్లె ప్రగతి పనులపై డీపీవో సమీక్ష
బకాయిలు చెల్లించని పంచాయతీలపై చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఎంపీవోలు సురేందర్ రెడ్డి, ప్రేమలత, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ శాఖ ఏడీ, ఏఈలు పాల్గొన్నారు.