యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధికి నేడు ఆదివారం సెలవు దినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
స్వామి వారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.