యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగానే ఉంది. బాలాలయంలో సుదర్శన నరసింహం, నిత్య కల్యాణం, ప్రసాద కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో రద్దీ స్వల్పంగా కనిపించింది. కొవిడ్ దృష్ట్యా ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు.
నారసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం
యాదాద్రిలో ఆదివారం నాడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా నిబంధనలు అమలు చేస్తూ ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు. బాలాలయం, సత్యనారాయణ వ్రత మండపాల్లో రద్దీ స్వల్పంగా కనిపించింది.
శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం, యాదాద్రి ఆలయం
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవల్లో పాల్గొని... మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొదటి ఘాట్ రోడ్డు విస్తరణలో ఉన్నందున 2వ ఘాట్ రహదారిలో కొండపైకి భక్తులను అనుమతిస్తున్నారు.