హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన మిర్యాల గోపాలకృష్ణ, లావణ్య దంపతులు హైదరాబాద్ శివారులోని రాయదుర్గంలో నివాసముంటున్నారు. లావణ్య(28)సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా, గోపాలకృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. నేరడ నుంచి రాయదుర్గంకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎల్లంబావి అండర్‌పాస్ వంతెన పైన పక్క నుంచి వెళ్తున్న ఓ లారీ ద్విచక్రవాహనం హ్యాండిల్‌ను ఢీకొట్టింది.
వెంటాడిన మృత్యువు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం - yadadri district news today
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పక్క నుంచి వెళ్తున్న ఓ లారీ బైక్ హ్యాండిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని లావణ్య ద్విచక్రవాహనం పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలంలో భార్య మృతదేహం వద్ద కుమార్తెను ఎత్తుకొని భర్త గోపాలకృష్ణ విలపించిన సంఘటన కలచివేసింది.
వెంటాడిన మృత్యువు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం
ఈ ఘటనలో లావణ్య ద్విచక్రవాహనం పైనుంచి అదుపు తప్పి కిందపడింది. తలకు బలమైన గాయం తగలడం వల్ల స్పాట్లో ప్రాణాలు విడిచింది. ఆమె భర్త, పాప స్వల్ప గాయాలతో ప్రాణాలు తక్కించుకున్నారు. ఘటనా స్థలంలో భార్య మృతదేహం వద్ద కుమార్తెను ఎత్తుకొని భర్త గోపాలకృష్ణ విలపించిన సంఘటన అందరిని కలచివేసింది.
ఇదీ చూడండి :మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..