తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు, డీసీఎం ఢీ.. ఇద్దరికి గాయాలు - DCM & Car Accident in Yadadri Bhuvanagiri District

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓడీసీఎం వాహనం కారును అతివేగంగా ఢీ కొట్టింది. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సమీపంలో ఈఘటన చోటు చేసుకుంది. సమయానికి కారులోని బెలూన్స్ తెరచు కోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది.

DCM & Car Accident in Yadadri Bhuvanagiri District
'యాదాద్రి భువనగిరి జిల్లాలో డీసీఎం, కారు - ఢీ'

By

Published : Jun 3, 2020, 6:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సమీపంలో డీసీఎం వాహనం.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలై రక్తసావ్రం అవుతుండటం వల్ల భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉడటం వల్ల.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

తప్పిన ప్రాణ నష్టం

డీసీఎం అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని బెలూన్స్ తెరుచుకోవడం వల్ల డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఉన్నవారు హైదరాబాద్ కు చెందిన పాశం మాధవ్, చాడ పద్మా రెడ్డిగా పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details