తెలంగాణ

telangana

ETV Bharat / state

'సన్నరకం ధాన్యానికి రూ.2500 మద్దతు ధర చెల్లించాలి' - yadadri bhuvangiri district news

సన్నరకం వరి ధాన్యానికి క్వింటాలుకు 2500 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని సీపీఎం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని సీపీఎం నాయకులు పరిశీలించారు.

cpm leaders demands to minimum support price for paddy in yadadri bhuvangiri district
'సన్నరకం ధాన్యానికి రూ.2500 మద్దతు ధర చెల్లించాలి'

By

Published : Nov 7, 2020, 10:59 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముసిపట్ల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని సీపీఎం నాయకులు పరిశీలించారు. నియంత్రిత విధానం ద్వారా సన్నరకం ధాన్యాన్ని పండించాలని చెప్పిన ప్రభుత్వం... మద్దతు ధర చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అన్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు బి-గ్రేడ్​ కింద 1868 క్వింటాలుకు చెల్లిస్తామని చెప్పడం అన్యాయమన్నారు.

సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు 2500 రూపాయలు చెల్లించాలని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అన్నదాతలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, దాడిపెళ్లి ప్రభాకర్, వెండి యాదగిరి, పిట్టల చంద్రయ్య, కందుకూరి నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎల్‌ఆర్‌ఎస్​ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ సిద్ధం

ABOUT THE AUTHOR

...view details