CPI and CPM celebrated munugode bypoll victory: మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం తెలంగాణ రాజకీయాల్లో శుభపరిణామమని, ఈ ఫలితం అనేది ప్రజాస్వామ్య గెలుపుగా భావిస్తున్నామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యాలయాల్లో సంబురాలు జరుపుకున్నారు.
మునుగోడు ఎన్నికల్లో భాజపా ఓటమి రాజగోపాల్‌రెడ్డికే కాకుండా మొత్తం భాజపాకు, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి చెంపపెట్టులాంటిది. మునుగోడు ప్రజలే ఇచ్చారు ఈ తీర్పును. భౌతికంగా, నైతికంగా, సాంకేతికంగా ఇది భాజపాకు మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెరాసకు మధ్యనే అసలు పోరు జరుగుతుంది రానున్న ఎన్నికల్లో.. అలాగే ఈ పార్టీలు అన్ని కలిసి ఒకవైపు ఉంటాయి ఎందుకంటే భాజపాను చిత్తుచిత్తుగా ఓడించడానికి. వామపక్షాలు భాజపా వ్యతిరేకంగా పోరాడతాయి. తెరాస, కాంగ్రెస్ కలిసి పోటీ చేయకపోయిన సరే.. కమ్యూనిస్టుల మద్దతు భాజపాను ఓడించే వారికే ఉంటుంది.ఈవిజయం భాజపా వ్యతిరేఖ శక్తులని ఏకం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది.- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి