యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా ఓ చంటిబిడ్డను ఎత్తుకొని ఆడించిన మహిళా కానిస్టేబుల్‌ను సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. అంకితభావంతో పనిచేస్తున్న ఆమెకు రివార్డు ప్రకటించారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి ఓ మహిళ చిన్నారితో కలిసి ఓటు వేయటానికి వచ్చింది.
చంటిబిడ్డను ఎత్తుకొని ఆడించిన కానిస్టేబుల్‌కు సీపీ అభినందనలు - Telangana news
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా ఓ చంటిబిడ్డను ఎత్తుకొని ఆడించిన మహిళా కానిస్టేబుల్‌ను సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. అంకితభావంతో పనిచేస్తున్న ఆమెకు రివార్డు ప్రకటించారు.
చంటిబిడ్డను ఎత్తుకొని ఆడించిన కానిస్టేబుల్‌కు సీపీ అభినందనలు
ఆమె ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ కవిత..... చిన్నారిని ఎత్తుకొని లాలించింది. సదరు మహిళ ఓటు వేసి వచ్చేంత వరకు ఓపికగా ఆడించింది. ఈ విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్... కవితను అభినందించారు. మరికొంతమందికి ఆమె ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ఇదీ చూడండి:ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్