రాష్ట్రంలో గ్రీన్‌జోన్‌గా ఉన్న యాదాద్రి జిల్లా వాసులను ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తున్న కార్మికులతో కరోనా భయం వెంటాడుతున్నది. ఈ నెల 7వ తేదీన ముంబయి నుంచి సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి వస్తున్న వారిని హైద్రాబాద్‌లో పరీక్షలు నిర్వహించగ వారిలో ముగ్గురికి కరోనా పాసిటివ్ రావడం వల్ల వారిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.
వలస కార్మికుల రాకతో కరోనా భయం
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి వస్తున్న వలసకార్మికుల్లో ముగ్గురికి పాజిటివ్‌రాగా అక్కడి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
యాదాద్రి భువనగిరిలో వలసకార్మికుల రాకతో కరోనా భయం
గ్రామానికి ఇంతకు ముందే ఎవరైన వచ్చారా.. ఒక వేళ వస్తే తమ పరిస్థితి ఏంటని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గ్రామంలో సోడియమ్ హైపో క్లోరైడ్ ద్రావణాన్ని విధులన్నింటిలో పిచికారీ చేయించారు. ప్రజలెవరు ఆందోళన చెందవద్దని అందరు కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!