యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని పాత బస్టాండ్, గడీ బజార్లో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
'చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకే కట్టడిముట్టడి'
చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకే కట్టడిముట్టడి నిర్వహిస్తున్నామని యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. మోత్కూరులోని పలు కాలనీల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహించిన పోలీసులు... సరైన ధ్రువపత్రాలు లేని 41 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
CORDON SEARCH IN MOTHKUR MUNICIPALITY
కట్టడి ముట్టడిలో భాగంగా కాలనీ ప్రజలతో డీసీపీ మాట్లాడారు. ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని వ్యాపారస్థులతో పాటు స్థానికులు వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు అమర్చుకుంటే నేరాల సంఖ్య తగ్గుతుందని డీసీపీ వివరించారు.
ఇవీ చూడండి: కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!
TAGGED:
మోత్కూరులో నిర్బంధ తనిఖీలు