తెలంగాణ

telangana

ETV Bharat / state

హాజీపూర్ బాధిత కుటుంబాలకు వీహెచ్​ ఆర్థిక సాయం - కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను కలిసిన వీహెచ్

హాజీపూర్ నిందితుడు సైకో శ్రీనివాస్​ రెడ్డికి ఉరిశిక్ష పడటంపై కాంగ్రెస్ సీనియర్ నేత హర్షం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కలిసి మిఠాయిలు తినిపించి ఆర్థిక సాయం అందజేశారు.

VH HELPS TO HAZIPUR VICTIMS
హాజీపూర్ బాధిత కుటుంబాలకు వీహెచ్​ ఆర్థిక సాయం

By

Published : Feb 7, 2020, 10:48 PM IST

హజీపూర్‌లో అత్యాచారం, హత్యకు గురైన ముగ్గురు బాలికల కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతురావు పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి న్యాయస్థానం ఉరి ఖరారు చేసిన సందర్భంగా ఇవాళ ఆయన హజీపూర్‌ గ్రామాన్ని సందర్శించారు. దిల్లీలో ఎన్నికల ప్రచారం ముగించుకొని హైద్రాబాద్ వచ్చిన వీెచ్ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా హజీపూర్ వెళ్లారు. అక్కడ ముగ్గురు బాధిత బాలికల కుటుంబాలతో మాట్లాడి, ఉరి ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు మిఠాయిలు పంచి పెట్టారు.

నేరస్థుడికి సరైన శిక్ష పడిందని... ఉరిని తక్షణమే అమలు చేస్తే ఇలాంటి నేరాలు చేసేందుకు మరొకరు భయపడతారన్నారు. అనంతరం నేరెడ్​మెట్​లో ఉన్న రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను కలిసి నిందితుడికి శిక్ష పడేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఈ కేసును పర్యవేక్షించిన డీసీపీకి, ప్రభుత్వ ప్లీడర్‌కు కూడా హనుమంతరావు ధన్యవాదాలు తెలియచేశారు.

హాజీపూర్ బాధిత కుటుంబాలకు వీహెచ్​ ఆర్థిక సాయం

ఇవీ చూడండి:జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన సీఎం కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details