యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని తంగడపల్లి వద్ద ఉన్న ఐఎన్ అగ్రోవేట్ పరిశ్రమను ఆర్డీవో సూరజ్ కుమార్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది మూసివేశారు. కోళ్ల వ్యర్థ్యాలతో దాణా తయారు చేసే ఈ కంపెనీ నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుందని జూన్ 6న గ్రామ ప్రజలు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. దీనితో స్వయంగా పరిశీలించిన ఆర్డీవో కంపెనీని సీజ్ చేయించారు.
దుర్వాసన వస్తుందని కంపెనీ మూసివేత - ఐఎన్ అగ్రోవేట్ పరిశ్రమ
కోళ్ల వ్యర్థాలతో దాణా తయారు చేసే కంపెనీని అధికారులు మూసివేశారు. కంపెనీ నుంచి అధికంగా దుర్వాసన వస్తుందని గ్రామస్థులు ఆర్డీవో కార్యాలయం ఎదుటు ధర్నా నిర్వహించినందున అధికారుల చర్యలు చేపట్టారు.
దుర్వాసన వస్తుందని కంపెనీ మూసివేత