తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో నిజ దర్శనాలపై త్వరలో నిర్ణయం

యాదాద్రి నరసింహస్వామి ఆలయం 56 నెలలుగా పునర్నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయంలో గల స్వయంభువులను దర్శించుకోవాలని భక్తులు కుతూహలంతో ఉన్నారు. ముహూర్త నిశ్చయానికి త్వరలో చినజీయర్​తో సీఎం భేటీ కానున్నారని సమాచారం.

Coming soon decision on real visions in Yadadri temple
యాదాద్రిలో నిజ దర్శనాలపై త్వరలో నిర్ణయం

By

Published : Jan 10, 2021, 7:26 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంతో 56 నెలలుగా స్వయంభువుల దర్శనాలు నిలిచాయి. సంక్రాంతి పండుగ తర్వాత దర్శనాలు తిరిగి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీలైనంత తొందరగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని సీఎం ఆదేశించారు.

పెండింగ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ప్రధానాలయ గోపురాలపై, కళాశాల ప్రతిష్ట, ధ్వజ స్తంభ స్థాపనలతో సహా భక్తులు గర్భాలయ ప్రవేశానికి నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ అంశంపై సీఎం కేసీఆర్​ చినజీయర్ స్వామిని కలిసే అవకాశం ఉందని యాడ"వర్గాలు" చెబుతున్నాయి. సంక్రాంతి పూర్తయ్యాక కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉన్నట్లు స్థానికంగా చర్చ కొనసాగుతోంది. భక్తులు కూడా స్వయంభు దర్శనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి :లైవ్ వీడియో: ప్రైవేటు బస్సు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details