యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతోనే నిన్న జరిగిన కారు ప్రమాదం నుంచి బయటపడ్డామని కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని కలెక్టర్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
స్వామి వారి ఆశీస్సులతోనే బయట పడ్డాం: కలెక్టర్
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని కలెక్టర్ అనితా రామచంద్రన్ దంపతులు దర్శించుకున్నారు. నిన్న కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వామి వారి దయతోనే క్షేమంగా బయటపడినట్లు తెలిపారు.
స్వామి వారి ఆశీస్సులతోనే బయట పడ్డాం: కలెక్టర్
కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు చేశారు. ప్రమాద సమాచారం తెలిసి పరామర్శించిన అందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:దుబ్బాక పోరు: భాజపా నేతల తీరుపై మంత్రి హరీశ్‌రావు ఫైర్