ఓ ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అప్పారెడ్డి పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పిడుగు ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పిడుగు నేరుగా చెట్టు మీదే పడటం వల్ల ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం - valigonda mandal
నిన్న సాయంత్రం కురిసిన వర్షంలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి చెట్టు దగ్ధమైంది.
పిడుగు చెట్టు మీదే పడటం వల్ల తప్పిన ప్రాణనష్టం