తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES: లబ్ధిదారుని వద్ద రూ.10వేలు ప్రభుత్వం ముందే తీసుకుంటుంది: సీఎం - CM KCR vasalamarri tour minute to minute live updates

CM KCR vasalamarri tour minute to minute live updates
కాసేపట్లో వాసాలమర్రి చేరుకోనున్న సీఎం కేసీఆర్

By

Published : Aug 4, 2021, 12:09 PM IST

Updated : Aug 4, 2021, 5:53 PM IST

17:52 August 04

10 లక్షలు కేవలం వ్యాపారాలే..

  • దళితబంధు నిధులు ఎలా ఖర్చు చేసుకుంటారో మీ ఇష్టం: సీఎం 
  • నిధులు వృథా కాకుండా ఉపాధి కలిగే మార్గాలు ఎంచుకోవాలి: సీఎం 
  • రూ.10 లక్షలు వ్యాపారాలు చేసుకోవడానికే ఉపయోగించాలి: సీఎం 
  • వాసాలమర్రిలోని ఎస్సీలకు దళితబంధు నిధులతో పాటు ఇళ్లు మంజూరు: సీఎం 

17:40 August 04

లబ్ధిదారుని వద్ద రూ.10వేలు ప్రభుత్వం ముందే వసూలు

  • వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలు ఉన్నాయి: సీఎం
  • వాసాలమర్రిలో 100 ఎకరాలకు పైగా మిగులు భూమి ఉంది: సీఎం
  • ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీలకు పంపిణీ చేస్తాం: సీఎం
  • ఎలాంటి వివాదాలు లేకుండా భూములు సర్వే జరిపిస్తాం: సీఎం
  • వాసాలమర్రిలో ఎస్సీల కమతాల ఏకీకరణ కూడా జరగాలి: సీఎం
  • రాష్ట్రంలో 16 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి: సీఎం కేసీఆర్‌
  • వాసాలమర్రిలోని 76 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తాం: సీఎం
  • 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచి దళితబంధు నిధులు పంపిణీ: సీఎం
  • గ్రామంలోని అందరికీ ఒకే విడతలో దళిత బంధు నిధులు పంపిణీ: సీఎం
  • ప్రతి లబ్ధిదారుని వద్ద రూ.10వేలు ప్రభుత్వం ముందే తీసుకుంటుంది: సీఎం
  • ముందే తీసుకున్న నిధులతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తాం: సీఎం
  • ఎస్సీలలో ఎవరికి ఆపద వచ్చినా... దళిత రక్షణ నిధి నుంచి ఆర్థికసాయం: సీఎం

17:39 August 04

ఎర్రవల్లిలో ప్రతి ఇంటికీ 24 గంటలు నీటి సరఫరా

  • వాసాలమర్రి గ్రామంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి: సీఎం
  • గతంలో ఎర్రవల్లి గ్రామం పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉండేది: సీఎం
  • ఎర్రవల్లిలోని ఇళ్లన్నీ పడగొట్టి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చాం: సీఎం
  • గ్రామస్థులను 6 నెలలు గుడారాల్లో ఉంచి ఇళ్లు నిర్మించి ఇచ్చాం: సీఎం
  • ఎర్రవల్లిలో ప్రతి ఇంటికీ 24 గంటలు నీటి సరఫరా జరుగుతోంది: సీఎం

17:20 August 04

  • యాదాద్రి: వాసాలమర్రిలో కొనసాగుతున్న సీఎం పర్యటన
  • రైతువేదికలో రైతులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌
  • ప్రభుత్వాలు పథకాలు తెచ్చినా... వాటిపై అవగాహన కొరవడింది: సీఎం
  • ఎన్నో పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్నాం: సీఎం
  • ఈ ఆరేళ్లల్లో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం: సీఎం
  • విద్యుత్‌, తాగునీరు, సాగునీరు సమస్య తీరింది: సీఎం కేసీఆర్‌
  • కులవృత్తులపై ఆధారపడిన వారిని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నాం
  • కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గింది: సీఎం కేసీఆర్‌
  • ఆదాయం తగ్గటం వల్ల కొన్ని పథకాల అమలు పెండింగ్‌లో ఉంది
  • ఏదేమైనా దళితబంధు పథకం అమలుచేసి తీరుతాం: సీఎం

17:20 August 04

  • యాదాద్రి: వాసాలమర్రిలో కొనసాగుతున్న సీఎం పర్యటన
  • వాసాలమర్రి గ్రామం ఎస్సీ వాడల్లో పర్యటించిన సీఎం కేసీఆర్‌
  • సుమారు 3 గంటలపాటు ఎస్సీ వాడలో పర్యటించిన సీఎం
  • సుమారు 60 ఎస్సీ కుటుంబాలతో మాట్లాడిన సీఎం కేసీఆర్‌
  • సీఎం కేసీఆర్‌కు పలు సమస్యలు వివరించిన వాసాలమర్రి ప్రజలు
  • ఇల్లు లేని వారికి రెండుపడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం హామీ
  • ప్రభుత్వ భూమిని నిరుపేద ఎస్సీలకు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం
  • బీడీ మహిళా కార్మికులకు వెంటనే పింఛను మంజూరు చేయాలని ఆదేశం

14:26 August 04

  • వాసాలమర్రిలో పలు వీధుల్లో పర్యటిస్తున్న సీఎం
  • కొన్నిచోట్ల ఆగి ఇళ్లలోని ఇంటి యజమానుల వివరాలు సేకిరించిన సీఎం
  • కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి
  • ఇళ్లు కావాలని కోరిన పేదలు
  • కట్టిస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్‌
  • దళితబంధు నిధులు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించిన సీఎం
  • వ్యవసాయం, కుటుంబ అవసరాలకు వాడుకుంటాన్నామని చెప్పిన ప్రజలు

13:09 August 04

గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న కేసీఆర్‌

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
  • యాదాద్రి: వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
  • అధికారులతో కలిసి దళితవాడలో సీఎం కేసీఆర్ పర్యటన
  • గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న కేసీఆర్‌

12:44 August 04

వాసాలమర్రి చేరుకున్న సీఎం కేసీఆర్

  • రోడ్డు మార్గం ద్వారా వాసాలమర్రి చేరుకున్న సీఎం కేసీఆర్
  • వాసాలమర్రి దళితవాడలో సీఎం కేసీఆర్ పర్యటన
  • రైతు వేదికలో 130 మందితో సమావేశం కానున్న సీఎం కేసీఆర్

11:49 August 04

వాసాలమర్రి చేరుకున్న సీఎం కేసీఆర్

  • యాదాద్రి: కాసేపట్లో వాసాలమర్రి చేరుకోనున్న సీఎం కేసీఆర్
  • వాసాలమర్రి దళితవాడలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
  • రైతు వేదికలో 130 మందితో సమావేశం కానున్న సీఎం కేసీఆర్
  • వాసాలమర్రిలో రైతు వేదికను ముస్తాబు చేసిన గ్రామస్థులు
  • దళితవాడను ముగ్గులు, తోరణాలతో అలంకరించిన మహిళలు
Last Updated : Aug 4, 2021, 5:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details